సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ, వైసీపీ సానుభూతిపరుడు, రచయిత, నటుడు పోసాని కృష్ణమురళికి నేడు, గురువారం ..ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. రాంగోపాల్ వర్మకు సీఐడీ జారీ చేసిన నోటీసులపై స్టే విధిస్తూ.. న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. వర్మ గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్స్ ను ఎద్దేవా చేస్తూ సినిమాలు తీసారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫిర్యాదులు అందగా.. విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది ఏపీ సీఐడీ. అయితే… ఈ కేసుని కొట్టివేయాలని కోరుతూ.. హైకోర్టులో వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ తరుణంలోనే… ఈ పిటిషన్‌ని విచారించింది హైకోర్టు.. వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు ఊరటనిస్తూ త‌దుప‌రి చ‌ర్యలు 6 వారాల వరకు నిలిపివేయాలని సీఐడీకి ఆదేశాలు ఇచ్చింది. అలాగే… పోసాని కృష్ణమురళి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. ఈ తరుణంలోనే… పోసాని ఫై చంద్రబాబుకు పవన్ కుటుంబ సభ్యులను గతంలో అసభ్యంగా తిడుతూ వ్యాఖ్యలు చేసారని.. ఇటీవల విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో… ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. ఇక తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *