సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్ర ప్రదేశ్ లో పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌కు సంబంధించి ఫారమ్‌-13ఏపై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్‌ చెల్లుబాటవుతుందని ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను అడ్డుకోవాలని ఇది రాష్ట్రంలో వైసీపీ కి వ్యతిరేకంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి పార్టీల కు మేలు చేకూర్చేందుకు చేస్తున్న ప్రయత్నంగా ఆరోపిస్తూ దీనిపై రాష్ట్ర హైకోర్టు అడ్డుకోవాలని అధికార వైసీపీ చేసిన విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి వైసీపీ రంగం సిద్ధం చేసుకుంది. హైకోర్టు తీర్పును సుప్రీంలో వైసీపీ సవాల్ చేయనున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు ప్రకటించారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు సుప్రీంకోర్టులో కేవివేట్ దాఖలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *