సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్, వివాదాస్వాద చిత్రాల సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాకు అడ్డంకులు తొలిగాయి. హైకోర్టు సూచనలతో వ్యూహం సినిమాకు రెండో సారి సెన్సార్ నిర్వహించారు. దీంతో సినిమాకు సెన్సార్ అడ్డంకులు తొలిగిపోయాయి. సినిమాను ఈ నెల 16న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిజానికి రెండు నెలల క్రితమే వ్యూహం సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. కానీ సినిమా విడుదలను నిలిపివెయ్యాలని నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన తండ్రి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యూహం సినిమా చిత్రీకరించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో చిత్ర నిర్మాత, దర్శకుడు కూడా హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు మరోసారి చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ బోర్డు యూ సర్టిఫికేష్ జారీ చేసింది. దీంతో వ్యూహం సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి.
