సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ లోని ఉత్తర తెలంగాణ లోని పలు ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం జిల్లాలో తాజగా మళ్లీ భూ ప్రకంపనలు సంభవించాయి. నేడు, మంగళవారం భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పొదిలి, దర్శి, ముండ్లమూరు మండలాల్లో రెండు సెకళ్ల పాటు భూమి కంపించింది. భయంతో ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు పరుగులు పెట్టడం జరిగింది. నిజానికి దర్శి నియోజకవర్గంలో గత ఏడాది డిసెంబర్‌లో వరుసగా నాలుగు రోజుల పాటు భూమి కంపించింది. గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతంలో భూగర్భంలో పొరలలో సర్దుబాటు కారణంగా భూమి కంపిస్తున్నట్లుగా ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు తెలిపారు.
