సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ రోజు టీడీపీ జనసేన మొదటి విడుత 99 మంది అభ్యర్థుల లిస్ట్ విడుదల నేపథ్యంలో నేడు, శనివారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.మాట్లాడుతూ.. అందరు అనుకున్నట్లే జరిగిందని, అధినేత పవన్ కల్యాణ్ను చూస్తే జాలేస్తోందన్నారు . జనసేన అభ్య ర్థులను కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తారా? అలాగే, ఎన్నో ప్రగల్బా లు పలికిన పవన్ ఇప్పుడు ఎన్నికల్లో చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి దిగజారిపోయారని, ఆయనకు పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు లేవని. అత్యంత దయనీయ స్థితిలో ఆయన ఉన్నారన్నారు. ఇచ్చిన 24 స్థానాలలో కూడా అభ్యర్థులను నింపే సామర్థ్యం హక్కు పవన్ కు లేవని, జనసేన కు మిగిలిన స్థానాల్లోనూ చంద్రబాబు తన అభ్య ర్థులను పంపుతారని జ్యోస్యం చెప్పా రు.. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేసినా తమ వైసిపి కు ఇబ్బంది లేదని. వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీదే ఘన విజయం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు..ఇకనైనా పవన్ను అభిమానించే వారంతా ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు చంద్రబాబు తాను ఓడిపోవడంతో పాటు జనసేన ను మింగేయ్యడం ఖాయం అని జోస్యం చెప్పారు సజ్జల..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *