సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎండ వేడిమికి విలవిలలాడుతున్న ప్రజలకు శుభవార్త! తాజాగా .. కోస్తా ఆంధ్ర తీరం నుం చి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావం తో రాగల ఐదు రోజుల పాటు పలు ప్రాం తాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపటి శుక్రవారం నుండి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి.నిన్న, నేడు, గురువారం పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో 40 నుండి 43 డిగ్రీల సెల్సి యస్ ఉష్ణోగ్రత నమోదైంది. నేటి గురువారం సాయంత్రం నుండి వాతావరణం చల్లబడి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఏదిఏమైనా ఇక రానున్న 5రోజులు వాతావరణం కొంత చల్లబడటం ఖాయం అని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.
