సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలపై విద్యుత్తు చార్జీల భారాన్ని బాగా తగ్గిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. విద్యుత్తు కొనుగోలు భారాన్ని కూడా యూనిట్‌ రూ.3.90 లకు తగ్గించుకునేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సమీక్షలో చెప్పారు. ట్రూడౌన్‌ ఫలితాలు ప్రజలకే అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.‘‘నెట్‌ జీరో ఎమిషన్‌ కాన్సెప్టుతో విద్యుత్‌ ఉత్పాదన జరగాలి. ఒక మీటరు వరకు భూగర్భ జలాలను పెంచడం ద్వారా దాదాపు రూ.4 వేల కోట్లు ఆదా అవుతుంది. పీఎం కుసుమ్‌, సూర్యఘర్‌ పథకాల కింద సోలార్‌ రూఫ్‌ టాప్‌ ప్రాజెక్టులు వేగంగా చేపట్టాలి. ఆర్టీసీలో కనీసం వెయ్యి ఎలక్ట్రికల్‌ బస్సులు కొనుగోలు చెయ్యాలి. స్వయం సహాయక సంఘాలకు ‘స్వయం’ అనే ఈ బ్రాండ్‌ ద్వారా తయారు చేసిన ఉత్పత్తులకు అతిపెద్ద మార్కెట్‌ అందుబాటులోకి వస్తుంది. అరకు కాఫీ తరహాలోనే కోకో పంటలకు కూడా మంచి బ్రాండింగ్‌ రావాలి. రాష్ట్రవ్యాప్తంగా 50 శాతం గ్రీన్‌ కవర్‌ లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలి. దీనిలో విద్యార్థులను భాగస్వాములను చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. సముద్ర తీర ప్రాంతంలో కోత నివారణకు ఉపముఖ్యమంత్రి పవన్ చేపట్టిన ప్రాజెక్టు అభినందనీయం’ అని చంద్రబాబు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *