సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల కూటమి అన్ని వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందని, సంకీర్ణ ప్రభుత్వంలో అన్ని వర్గాలను ఆదుకుంటామని, ప్రజలు మార్పు కోరుకొంటున్నారని, మాజీ ఎమ్మెల్యే, భీమవరం ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం 3వ వార్డుకు చెందిన జనసేన నేతలతో ఆయన సమావేశం అయ్యారు. ఆ వార్డుకు చెందిన వైసీపీ అభిమానులు యాతం పాండు, జాను కొండబాబు, మరికొందరు యువకులు,వార్డు మహిళలు మాజీ ఎమ్మెల్యే అంజిబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు సమక్షంలో జనసేన పార్టీలో చేరినట్లు ప్రకటించారు. . మాజీ ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. అమలుకాని హామీలతో ప్రజల్లోకి ఎక్కి వైసీపీ నేతలు పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారని, వైసీపీని తరిమి కొట్టి సంకీర్ణ ప్రభుత్వాన్ని గెలిపించాలని అన్నారు. చినబాబు మాట్లాడుతూ 9 రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయని, గాజుల గుర్తుకు ఓటు వేసి అంజిబాబు ను గెలిపించాలని అభ్యర్థించారు.టీడీపీ మాజీ మునిసిపల్ వైస్ చైర్మెన్ మెంటే గోపి, జనసేన పట్టణ అధ్యక్షుడు చెన్నమల చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *