సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలు-2024ల్లో రేపటి గురువారం నుండి కీలక నామినేషన్స్ ఘట్టం ప్రారంభం కానుంది. ఈ నెల 25 లోగ నామినేషన్స్ పక్రియ పూర్తీ కావలసి ఉంది. టికెట్స్ సర్దుబాటులో కూటమి మధ్య ఆలస్యం జరిగినప్పటికీ పోలింగ్ తేదికి 4వారాల సమయం లేకపోవడంతో గెలుపే లక్ష్యంగా ఎన్డీయే పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ ప్రచారాన్ని ఇటీవల ఉద్ధృతం చేశాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత, పవన్ కల్యాణ్ సంయుక్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ప్రచారంలో భాగంగా ఇరువురు అధినేతలు నేడు శ్రీరామనవమి రోజు కూడా (బుధవారం) పెడనలో రోడ్‌షో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన జనాలను ఉద్దేశించి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉత్సహ పూరితంగా మాట్లాడారు… రాష్ట్రంలో అవినీతి, అరాచక ప్రభుత్వం రాజ్యం ఏలుతుందని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసారని, అభివృద్ధి లేదని, దీనిని ప్రజలు అధికారం నుండి దించి తీరాలని ప్రజల హక్కులను సీఎం జగన్ కబ్జా చేస్తున్నారని ప్రజల ఆస్తులకు సంబందించిన రిజిస్ట్రేషన్ పత్రాల ఫై జగన్ బొమ్మలు ఎందుకూ ? ఆయనది కానీ ఆస్తులపై హక్కులు కూడా ఆయనకే ప్రజలు ఇచ్చేసే పరిస్థితి కల్పిస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు.. మచిలీపట్నంలో ఎప్పుడు రానటువంటి మెజారిటీ జనసేన, కూటమి అభ్యర్థి బాలసౌరి కి ఇప్పించాలని ప్రజలను అభ్యర్ధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *