సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రముఖి వస్తే ప్రజల రక్తం తగ్గుతుందని ఇటీవల సీఎం జగన్ పెద్ద ఎత్తున తన సభలో ప్రచారం చేస్తున్న నేపథ్యంలో దానికి కౌంటర్ గా నేడు, శనివారం దర్శి ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఒకమాట చెప్పి.. అధికారంలోకి వచ్చాక ప్రజలపై పన్నులు, కరెంట్ చార్జీల భారం వేసి జగన్ బాదుడే బాదుడుకు తెరతీశారని మండిపడ్డారు. నిజానికి జగన్ ప్రజల రక్తం తాగే రకమని… తాను ప్రజలకు కొత్త రక్తం ఎక్కించే రకమన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు జగన్ ఖర్చుపెట్టింది చాలా తక్కువే అని..నా పాలన హయాంలో సంక్షేమ కార్యక్రమాలకు 19.1 శాతం ఖర్చు పెడితే.. జగన్ పెట్టింది 15.8 శాతం మాత్రమే… చెయ్యని పనికి జగన్ డబ్బాలు కొట్టుకుంటున్నారు’’అని చంద్రబాబు అన్నారు. ‘ఎన్నికల ముందు తల మీద చెయ్యి పెట్టాడు, ముద్దులు పెట్టాడు, బుగ్గలు నిమురాడు.. అధికారంలోకి వచ్చాక వీరబాదుడు బాదుతున్నాడు.. ఇప్పుడు ఎన్నికలు వచ్చాక బహిరంగ సభలలో సీఎం జగన్ ప్రజలకు ఏం చెప్పాలో తెలీక కన్ఫ్యూజన్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. నవరత్నాలు పేరుతో జనాలను మోసం చేశారని.. ఇప్పుడు ఆ నవరత్రాలు రాలిపోయాయన్నారు. ‘‘సైకో జగన్ను ఇంటికి పంపించాలి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని పవన్ కళ్యాణ్ అభిమతం… అందుకే జట్టు కట్టాం’’ అని చంద్రబాబు అన్నారు. ఎస్సీలకు 27 పథకాలు, బీసీలకు 30 పథకాలు, మైనార్టీలకు 10 పథకాలు రద్దు చేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని అన్నారు.
