సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతిలో ఏమిటో ఇటీవల టీటీడీ నిర్ణయాలు అవగాహన లోపంగా కనపడుతున్నాయి. మన ఏపీ ప్రజా ప్రతినిధులతో పాటు కూటమి అధికారంలోకి వచ్చాక ఇటీవల తెలంగాణ ప్రజా ప్రతినిదుల సిఫార్స్ లేఖల కు కూడా విఐపి దర్శనాలకు అనుమతులు ఇవ్వడంతో సామాన్య భక్తుల దర్శనాలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఇక వేసవి సెలవులలో సామాన్య భక్తుల రద్దీ పెరగటంతో వచ్చే జూన్ 15వరకు సిఫార్స్ లేఖలను పూర్తిగా రద్దు చేశామని టీడీడీ ప్రకటించింది. ఇంతలో భారత్ – పాక్ యుద్ధ వాతావరణంలో భక్తుల సంఖ్యా కాస్త తగ్గడంతో తాజగా తిరుమల శ్రీవారి దర్శనార్థం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖల పునరుద్ధరణకు మాత్రమే తాత్కాలికంగా టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈనెల 15వ తేదీ నుండి సదరు నేతల సిఫార్సు లేఖలను మాత్రమే టీటీడీ అనుమతించనుంది. అయితే మిగిలిన వారి సిఫార్సు లేఖలపై అంతకు ముందు తీసుకున్న నిర్ణయం కొనసాగుతుంది. అయితే యుద్ధం ఆగిపోయిన నేపథ్యంలో తాజగా మరల సామాన్య భక్తుల రాక తిరుమలకు పెరిగింది. ఏంటో.. TTD ఒక సమన్వయము తొ నిర్ణయాలు తీసుకొంటున్నట్లు లేదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *