సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆస్కార్ సాధించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతోతెలుగు హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్ కేజ్ ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయి ఒక్కసారిగా గ్లోబల్ స్టార్‌గా మారిపోయారు. అయితే ఎస్‌ఎస్ రాజమౌళికి జేమ్స్ కామెరూన్ వంటి ప్రపంచ నెంబర్ 1 డైరెక్టర్ సైతం హాలీవుడ్ సినిమా చేయమని అంతా తాను చూసుకొంటామని ఓపెన్ ఆఫర్లు సైతం ఇచ్చారు. ఇటీవల ఎక్కువ సార్లు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్ అయిన నటుల జాబితాలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ మొదటి రెండు స్థానాల్లో నిలిచారు.ఈ తరుణంలో ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు, పెద్దలలో పాపులారిటీ ఉన్న మార్వెల్ స్టూడియో ‘అవెంజర్స్’ సిరీస్ సినిమాల్లో ఎన్టీఆర్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఓ అభిమాని షేర్ చేసిన పోస్టర్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అందులో ‘బ్లాక్ పాంథర్: వాకండా ఫరేవర్’కి సంబంధించిన పోస్టర్‌ షేర్ చేశారు. దానికి.. కింగ్ టి’చల్లా కుమారుడు ప్రిన్స్ టి’చల్లాగా ఎన్టీఆర్ నటించనున్నట్లు సమాచారం ఉన్నట్లు రాసుకొచ్చారు.ఈ వైరల్ పోస్ట్‌పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఎన్టీఆర్ కు అవెంజర్స్ లో మంచి సూపర్ హీరోగా క్యారెక్టర్ కుదిరేలా చేయమని మార్వెల్ స్టూడియోస్ కు సూచనలు చెయ్యడం మొదలు పెట్టారు. మరి ఎప్పటికి కార్యరూపం దాల్చుతుందో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *