సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం తెలుగు రాష్ట్రాలలో ‘రక్షా బంధన్’ తోబుట్టువులకు పవిత్రమైన పండుగ. సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయతకు గుర్తుగా, తన సోదరుని రక్షణ కోసం రక్షాబంధన్ ఘనంగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున అక్కాచెల్లెళ్లు తమ సోదరుల చేతికి రాఖీ కడతారు. స్వీట్లు తినిపించి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఈ క్రమంలో సోదరీమణులకు జీవిత పర్యంతము ఏ సమస్య వచ్చిన తాము అండగా ఉంటామని అన్నాతమ్ముళ్లు వాగ్దానం చేస్తారు. సోదరులు తమ అక్కాచెల్లెళ్లకు విలువైన బహుమతులు ఇచ్చి వారిపట్ల తమ ప్రేమను చాటుకుంటారు. సోదరి మణులు సోదరులకు హారతులు ఇచ్చి మిఠాయిలు తమ చేతితో తినిపిస్తారు. నేడు శ్రావణ పౌర్ణమి కూడా కావడంతో పండితులు యజ్ఞ యాగాదులు నిర్వహిస్తున్నారు
