సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు కు బ్యాంక్ కాలనీలోని వారి స్వగృహం వద్ద వేలాదిమంది ప్రజలు, కూటమి పార్టీ శ్రేణులు, అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. DNR కళాశాలలు , ఇంజనీరింగ్, విద్యాసంస్థల పాలకవర్గ కార్యదర్శి గాదిరాజు బాబు, వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగ రాజు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటలు వరకు కూడా ఆయన ప్రజలుకు అందుబాటులో ఉన్నారు.ఈ సందర్భముగా MLA,అంజిబాబు మాట్లాడుతూ.. మీ ఆదరణ అభిమానం ఎప్పటికీ మారవలేనని, మీకు అండగా నిలబడతానని, తనను స్వయంగా కలిసి ఫోన్ ల ద్వారా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ నూతన సంవత్సరం ప్రతి కుటుంబం కూడా అన్ని విధాలుగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *