సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం అనాకోడేరులోని డిఎన్నార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్కూల్ కిట్స్ ను స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. కష్టపడి చదువుకుంటే అన్ని సౌకర్యాలు ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని, ప్రతి విద్యార్థి ఒక సైంటిస్ట్ .. డాక్టర్ ఇంజనీర్ గా ఎదగాలని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందన్నారు. విద్యతోనే రాష్ట్ర అభివృద్ధి అని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణ పట్టుదలతో విద్యను అభ్యసించాలని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. విద్యార్థులను బడిలోనే పంపే బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని, డ్రాఫ్ట్ అనేది లేకుండా చూడాలని, ప్రతి విద్యార్థి తప్పకుండా చదువుకోవాలని అన్నారు. పేద విద్యార్థులను పై చదువుకు వెళ్ళే వారికి దాతల సహకారంతో మేమే చదివిస్తామని, పది మందికి ఉపాధి లభించే స్థాయికి విద్యార్థులు ఎగదలని అన్నారు. అనంతరం విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జుత్తిగ దుర్గప్రసాద్, ఉప సర్పంచ్ విశ్వేస్, నిర్మల కుమారి, గుడపాటి మిల్టన్, ఎంపీటీసీ యర్రంశెట్టి వెంకటేశ్వరావు, దంతులూరి పల్లంరాజు, జనసేన పట్టణ అధ్యక్షుడు చెన్నమల చంద్రశేఖర్,జెడ్పీటీసీ కండ్రెగుల నరసింహారావు, ఏంఈవో వి వెంకటేశ్వర్లు, మాజీ మునిసిపల్ ప్లోర్ లీడర్ గాదిరాజు తాతారాజు, వబిలికృష్ణ రామకృష్ణ, రాట్నల శ్రీనివాస్, చల్లా రాము, రెడ్డి సత్తిబాబు, గొర్ల గోపి, ముచ్చకర్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
