సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వీరవాసరం మండలం లో నేడు, శనివారం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. భీమవరంలో వైసీపీ గెలుపు ఇప్పటికే ఖాయం అయ్యిందని అయితే కనివిని ఎరుగని భారీ మెజారిటీ కావాలని గ్రంధి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.. వచ్చే మే నెల 13వ తారీకు జరిగే సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలో 175 సీట్లను కచ్చితంగా తమ వైసిపి పార్టీ గెలుస్తుందని ఇందులో ఎటువంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేసారు. వీరవాసరం మండలంలో పలు గ్రామాలలో శనివారం ఆయన నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ముందుగా తోకలపూడి, చింతల కోటి గరువు, రాయకుదురు, వీరవల్లిపాలెం, వీరవాసరం, వడ్డీ గూడెం, పెరికిపాలెం, నందమూరు గరువు, దూసనపూడి తదితర గ్రామాలలో ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు కాబట్టి ప్రజల్లోకి వెళ్లి ఓటు అడిగే హక్కు తమ వైసిపికి మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. 2014 ఎన్నికలలో ఆనాడు చంద్రబాబు 600 కి పైగానే హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేశారని, అటువంటి వ్యక్తి నేడు అన్ని పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి ప్రజలకు మేలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అధికారం నుండి తప్పించాలని ప్రజలకు లేనిపోని హామీలను ఇస్తున్నారని, చంద్రబాబు, పవన్ కూటమి గతంలో చేసిన మోసాలను గుర్తుంచుకోవాలని తనకు భారీ మెజారిటీని అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు.
