సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం నేడు, సోమవారం లభించింది. ప్రధాని మోదీ వహించిన ప్రపంచ నాయకత్వానికి గానూ ‘‘ది కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ’’తో సత్కరించారు. ప్రధాని మోదీ ఫిజీ దేశానికి చెందిన ప్రధానమంత్రి సితివేణి రబుకా నుంచి పతకాన్ని అందుకున్నారు. ఫిజియేతర వ్యక్తికి అరుదైన గౌరవంగా పిఎం మోదీని పౌర పురస్కారంతో సత్కరించారు. భారతీయ మూలాలు ఉన్న ప్రజలు అత్యధికంగా నివసిస్తూ మినీ ఇండియాగా పిలువబడే పీజీ దేశం ఇచ్చిన పురస్కారం నేపథ్యంలో.. ‘ ఫిజీ పౌర పురస్కారం మన ప్రధానికి దక్కడం భారతదేశానికి పెద్ద గౌరవం. మోదీ ప్రపంచ నాయకత్వానికి గుర్తింపుగా ఫిజియేతరులు కొద్దిమంది మాత్రమే ఈ గౌరవాన్ని అందుకున్నారు’’ అని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.రెండు దేశాల మధ్య మైత్రిలో కీలక పాత్ర పోషించిన భారత ప్రజలకు, ఫిజీ-ఇండియన్ ప్రజలకు ప్రధాని మోదీ ఈ గౌరవాన్ని అంకితం చేశారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
