సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లి, ఇటీవల 100ఏళ్ళు పూర్తీ చేసుకొన్న హీరాబెన్ మోదీ అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రిలో గత 2 రోజులుగా చికిత్స పొందుతూ నేడు తుది శ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు నేడు, శుక్రవారం ఉదయం గాంధీనగర్ లో ప్రారంభమయ్యాయి.ప్రధాని మోదీ కాన్వాయ్ ఆయన తల్లి హీరాబెన్ నివాసానికి చేరుకుంది.గాంధీనగర్‌లో మోదీ తో సహా కుటుంబసభ్యులు హీరాబెన్ అంత్యక్రియలు నిర్వహించారు. తల్లి పాడిని కుటుంబ సభ్యులు తో కలసి స్వయంగా మోడీ మోయ్యడం జరిగింది. గాంధీనగర్‌లోని సెక్టార్ 30 శ్మశాన వాటికలో హీరాబెన్ మోదీ అంత్యక్రియలు కొద్దీ సేపటి క్రితం( 10.50 am) పూర్తీ చేసారు. . అంత్యక్రియలు జరిగుతున్న ఘటనాస్థలికి రావద్దని బీజేపీ కార్యకర్తలను ప్రధాని కోరారు. హీరాబెన్ మరణించారనే వార్త వెలువడగానే దేశవ్యాప్తంగా ప్రముఖులు, ప్రజల నుంచి సంతాపాలు, నివాళులు వెల్లువెత్తాయి
