సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, బుధవారం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ ముందుగా కేంద్ర అటవీ పర్యా వరణ శాఖ మం త్రి భూపేంద్రయాదవ్ తో భేటీ అయ్యారు. తదుపరి ప్రధాని మోడీతో మద్యాహ్నం 12 .30 నుండి ఒంటిగంటన్నర వరకు దాదాపు గంటకు పైగా సీఎం వైఎస్ జగన్ సుదీర్ఘంగా జరిగిన భేటీ ముగిసింది. ఏపీకి రావాల్సిన నిధులు, కేంద్ర నుండి రావలసిన పెండింగ్ బకాయిలు, పోలవరం సహా పలు అంశాలపై , కొత్త మెడికల్ కళాశాలలు కు అనుమతులు, తెలంగాణ నుండి ఏపీ కి రావలసిన విద్యుత్ బకాయిలు తదితర అంశాలపై కేంద్రం చొరవ చూపాలని కోరారు. ఇంకా రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదని, పోలవరం అనుకున్న సమయానికి పూర్తికాదని, బిల్లులు త్వరగా చెల్లిస్తున్నామని చెప్పడం, విజయవాడ మెట్రోపై సవరించిన డీపీఆర్ కోరడం సహా అనేక అంశాలపై ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం సమాధానాలు ఇచ్చిన విషయం తెలిసిందే. కేంద్రం సమాధానాల నేపథ్యంలో… రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని గతంలో ఇచ్చిన హామీలు పరిష్కరించాలని సీఎం జగన్ ప్రధానికి విజ్ఞప్తి చేసారు. దానికి ప్రధాని సానుకూలంగా స్వందించినట్లు తెలుస్తుంది.(ఫై తాజా చిత్రంలో శ్రీ వేంకటేశ్వరుని ప్రతిమ ప్రధాని మోడీకి అందిస్తున్న సీఎం జగన్)
