సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఢిల్లీ లో నేడు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగర్జున కుటుంబం భేటీ అయింది. కుటుంబ సమేతంగా ప్రధాని మోడీని కలిసేందుకు అక్కినేని నాగార్జున, అమల, నాగ చైతన్య , శోభిత ధూళిపాళ్ల పార్లమెంటుకు వెళ్లారు. ఇటీవల టాలీవుడ్ దిగ్గజం స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావుపై భారతీయ సినిమాకు నాగేశ్వరరావు చేసిన కృషిని ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. మోదీ చేసిన వ్యాఖ్యలకు హీరో నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించి ధన్యవాదాలు తెలిపారు. తాజాగా జరిగిన మీటింగ్ అక్కినేని నాగేశ్వరరావు బయోగ్రాఫీ లాంఛ్ చేయించాలని ప్రధానిని నాగార్జున కోరినట్లు సమాచారం అయితే ప్రధానిని కలిసే ముందు నాగార్జున పార్లమెంటులోని టీడీపీ ఆఫీసు కు వెళ్లారు. అక్కడ పలువురు ఎంపీలతో ఆయన మాట్లాడాడు. ఈ క్రమంలోనే నాగార్జున పార్లమెంట్ లో టీడీపీ కార్యాలయానికి రాగ అక్కడ నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి నాగార్జునతో కలిసి ఫోటో దిగారు. ఇటీవల తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో పలు ఇబ్బందులు పడుతున్న నాగార్జున ప్రధాని మోడీ ని కలవడం తదుపరి నాగార్జున టీడీపీ కార్యాలయానికి వెళ్లడం ఫై ఆసక్తి కర చర్చకు తావిచ్చినట్లయింది.
