సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: ఢిల్లీలో నేటి శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గంటకు పైగా జరిగిన సుదీర్ఘ భేటీ ముగిసింది. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, గోరంట్ల మాధవ్, మిథున్‌రెడ్డి ఉన్నారు.రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను, సీఎం సూటిగా ప్రధానికి వివరించినట్లు తెలుస్తుంది. నివేదించారు. రాష్ట్ర విభజన ఆర్థిక ప్రగతిని తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. విభజన సమయంలో 58 శాతం, జనాభా ఏపీకి రాగా, కేవలం 45 శాతం మాత్రమే రెవెన్యూ దక్కిందన్నారు. .రాష్ట్ర విభజన వల్ల రాజధానిని కూడా ఏపీ కోల్పోయింది. తెలంగాణలో ఏర్పాటు చేసుకున్న మౌలిక సదుపాయాలనూ కోల్పోయాం. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలి. ప్రత్యేక హోదాతో పాటు అనేక హామీలు ఇచ్చారు. వీటిని అమలు చేస్తే చాలా వరకు ఊరట లభిస్తుంది. 2013 భూసేకరణ చట్టం వల్ల పోలవరం ఖర్చు గణనీయంగా పెరిగింది.పోలవరం అంచనా వ్యయాన్ని రూ.55,657 కోట్లుగా నిర్ణయించాలి. పోలవరం నిర్మాణంపై పెండింగ్‌లో ఉన్న రూ.18,830.87 కోట్లు చెల్లించాలని’’ సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్ సమావేశం అయ్యారు.
