సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు నేడు, మంగళవారం మదనపల్లిలో నిర్వహించిన రాష్ట్ర బీజేపీ నేతల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధతో దత్తపుత్రికగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము అభివృద్ధి పధంలో పయనిస్తుందన్నారు. కేంద్ర సహకారంతో ఏకంగా రూ.8.16 లక్షల కోట్లతో ఏపీ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి జరుగుతోందని తెలిపారు.జాతీయరహదారులు, రైల్వే ప్రాజెక్టులు, విమానాశ్రయాల అభివృద్ధికి కేంద్రం వేల కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు జరుపనున్నట్లు, దీనికి అన్ని ప్రాంతాలలో బీజేపీ క్యాడర్ సన్నద్ధం కావాలని , ఏపీలో వారసత్వ రాజకీయాలు నడిపితే టీడీపీ, వైసిపి లతో బీజేపీ పొత్తులు ఉండవని జనసేన తోనే ముందుకు వెళ్తామని మరోమారు సోము వీర్రాజు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *