సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలులోని ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ కు నేటి గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ఆయనకు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తదితరులు ఘన స్వాగతం పలికారు. ఇక విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో ప్రధాని సున్నిపెంట చేరుకొన్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రానికి బయలు దేరారు. నేటి .మధ్యాహ్నం 12.05 గంటల వరకు శ్రీశైల మల్లన్న సన్నిధిలో ఆలయ మర్యాదలతో పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్లో నన్నూరుకు బయల్దేరుతారు. రాగమయూరి గ్రీన్ హిల్స్ వద్ద ‘సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్’ బహిరంగ సభకు మోదీ హాజరై ప్రసంగించనున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 5గంటలకు తిరిగి ఢిల్లీ బయలు దేరుతారు.
