సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అపాయింట్‌మెంట్ కోరుతూ లేఖ రాశారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 45 రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాజ్యాంగ వ్యవస్థలు కూప్పకూలిపోయాయని, యంత్రాంగం నిస్తేజంగా మారిపోయిందన్నారు. 31మంది వైసీపీ పార్టీకి చెందినవారు హత్యకు గురి అయ్యారని వందలాది మందిపై టీడీపీ గుండాలు దాడులు చేసి గాయపరచడం , ఆస్తులు విధ్యంసం చేస్తున్నారని, ఇళ్లు, భవనాలు కూల్చేస్తున్నారని, వ్యాపార సంస్థలపైనా దాడులు చేస్తున్నారని, రోడ్డుపై చిల్లర వ్యాపారులను వదలటం లేదని.. రాష్ట్రంలో ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, అధికార పార్టీకి చెందిన నాయకులు, వారి కార్యకర్తలు స్వైరవిహారం చేస్తున్నారని, రాష్ట్రంలో అత్యంత భయానక వాతావరణం నెలకొందన్నారని, వైసీపీ కి ఓటు వేసినవారిపై నడి రోడ్డుపై దాడులు,భయానక హత్యలు అత్యంత అనాగరిక సంఘటనలు జరుగుతున్నాయని, జగన్ పేర్కొన్నారు. వైసీపీ తరఫున పార్లమెంటుకు ఎన్నికైన వారు, శాసనసభకు ఎన్నికైన వారు, ఆయా స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులకూ రక్షణ కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పుంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్పగారిని పరామర్శించడానికి వెళ్లిన తమ పార్టీకి చెందిన లోక్‌సభ పక్ష నాయకుడు, ఎంపీ మిథున్‌రెడ్డిపై టీడీపీ మూకలు హత్యాయత్నానికి దిగాయన్నారు. పోలీసుల సమక్షంలోనే ఈదాడి జరిగిందని, చివరకు ఒక ఎంపీకి కూడా రక్షణ కల్పించలేని దారుణ పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. ఒక పథకం ప్రకారం .. రాష్ట్రంలో అసలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదన్న ఏకైక లక్ష్యంతో ఇవన్నీ చేస్తున్నారని, ఆ మేరకు ప్రభుత్వంలో ఉన్నవారు.. పైస్థాయి అధికారులు మొదలు కింది స్థాయి వరకూ సిగ్నల్ పంపారని జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా రాజకీయమయం చేశారని …రాష్ట్రంలో దాదాపు 27 మంది ఐఏఎస్, 24 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా చేశారంటే.. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న ఘటనలన్నింటిపైనా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో విచారణ జరపాలని కోరుతున్నానన్నారు. ఈ విషయమై మిమ్మల్ని కలిసి, వ్యక్తిగతంగా నివేదించడం కోసం.. మీకు అనుకూల సమయంలో వీలైనంత త్వరగా అపాయింట్‌మెంట్ ఇస్తే, రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులను వ్యక్తిగతంగా వివరిస్తానని జగన్ పేర్కొన్నారు.
