సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బీజేపీ కి 240 స్థానాలలో సొంతమేజారిటీ లేకపోయినా (గతం కంటే 60 కి పైగా స్థానాలలో ఓటమి) ఎన్డీయే కూటమిలో చిన్నపార్టీల సభ్యుల సహకారంతో కలపి 400 కాదుకదా కేవలం 293 సీట్లతో 277 కు కటకటి మ్యాజిక్ ఫిగర్ తో ముచ్చటగా మూడవసారి ప్రధానిగా పదవి స్వీకారం చేస్తున్న మోడీ కి ఈసారి పెను సవాళ్లు ఎదురు కానున్నాయి. అంత చేసి ఉత్తరప్రదేశ్ తో పాటు అయోధ్య ఎంపీ సీటు కూడా బీజేపీ చేజారింది. ప్రతిపక్షం బలంగా పుంజుకొంది. అన్ని ఎగ్జిట్ పోల్స్‌ లెక్కలు దారుణంగా తప్పాయి. అందరి అంచనాలను తలకిందులు చేసింది ఇండియా కూటమి. ఈ కూటమి గెలిచిన సీట్ల సంఖ్య 234. అంటే మ్యాజిక్ ఫిగర్‌కు అత్యంత దగ్గరగా వచ్చింది కూటమి. దీనిని ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే దేశ వ్యాప్తంగా మోడీ మ్యాజిక్ తగ్గింది అని చెప్పకనే చెబుతోంది ఈ ఫలితం. ఇందులో కాంగ్రెస్‌ గెలిచిన సీట్ల సంఖ్య 99. ఒక ఇండిపెండెంట్ చేరిపోవడం తో 100 రౌండ్ ఫిగర్ అయ్యింది. ఆ తర్వాత యూపీలో బీజేపీ నడ్డి విరిచి సమాజ్‌వాదీ పార్టీ ఏకంగా 37 సీట్లను గెలుచుకుంది. ఆ తర్వాత తృణమూల్ 29 సీట్లు. తమిళనాడు లో కాంగ్రెస్ 9 సీట్లతో కలపి డీఎంకే 22 సీట్లతో ఉన్నాయి.మహారాష్ట్రలో కూడా ఎన్డీఏను మట్టికరిపించింది, ఉద్దవ్ థాక్రే శివసేన భారీగా పుంజుకొంది. అంటే కూటమిలో ఉన్న ప్రతి పార్టీ బలపడింది. 2014లో కాంగ్రెస్‌ గెలిచిన సీట్లు 52 మాత్రమే. కానీ ఇప్పుడు ఆ నంబర్‌ ఆల్‌మోస్ట్‌ డబుల్ అయ్యింది. పెట్రోలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలపేదరికం, నిరుద్యోగం, రిజర్వేషన్ల రద్దు, సామాజిక, ఆర్థిక అంతరాలు పెరుగుతున్నాయంటూ కూటమి చేసిన ప్రచారం ఫలితం చూపించింది. ప్రజల ఆలోచన విధానం మారింది. అధికారం చేపట్టకపోయినా.. ఇండియా కూటమి ఈ ఎన్నికల్లో చాల ఎక్కువ సాధించింది. ఏ సమయంలో నైనా ఎన్డీయే లో చిన్న చీలిక వచ్చిన ఇండియా కూటమి అధికారం చేపట్టే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే మమతాబెనర్జీ, ఉద్దవ్ థాకరే, స్టాలిన్ లాంటి నేతలు ఈసారి మోడీ పూర్తీ ఎక్కువ కాలం ప్రధానిగా ఉండటంఫై నర్మగర్భ వ్యాక్యలు మొదలు పెట్టారు. ఏది ఏమైనా ప్రతిపక్షం బలంగా ఉండటం ప్రజా స్వామ్య విజయం.. సిగ్మా ప్రసాద్ కాలమ్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *