సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం ఎంపీ స్థానం నుండి కూటమి బలపరచిన బీజేపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ కు కేంద్ర మంత్రి వర్గంలో స్తానం ఖరారు కానున్నట్లు సమాచారం. నేడు రాత్రి జరిగే ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారంలో కాబినెట్ మంత్రులుగాఏపీనుండి టీడీపీ కి చెందిన ఇద్దరి తో పాటు భీమవరం కు చెందిన 3న్నర దశాబ్దాల బీజేపీ సేవకుడు ప్రస్తుత ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కు మంత్రి పదవి ఖాయం అని తెలుస్తుంది.కాస్త ఆలస్యంగా ఢిల్లీ నుండి ఫోన్ కాల్ రావడంతో హడావిడికి బయలు దేరిన వర్మ ఇప్పటికే ప్రధాని నివాసం చేరుకొన్నారు. దీనిని బలపరుస్తూ ఇప్పటికే మాజీ ఎంపీ ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు తాజాగా.. వర్మ కు అభినందనలు తెలుపుతూ అడ్వాన్సుగా ట్వీట్ పెట్టడం జరిగింది. రాజమండ్రి సభలోనే మోడీ వేదికపై శ్రీనివాస వర్మ కు మీరు గెలచి ఢిల్లీ రండి.. మీ సంగతి నేను చూసుకొంటా.. అంటూ హామీ ఇచ్చారు.. అది నిజం కాబోతుందా.? గతంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక్కడ ఎంపీగా గెలచి కేంద్ర సహాయ మంత్రి పదవులు పొందిన వారసత్వంగా వర్మ కూడా కొనసాగిస్తారని ఆసిస్తూ.. మంచి మిత్రులు శ్రీనివాస వర్మ కు సిగ్మా న్యూస్ తరపున అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
