సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి నేడు, మంగళవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ‘ప్రజలు ఫోన్ చూడండి.. జై శ్రీరాం అనండి. అలా ఆకలితో చావండి.. ఇదే ప్రధాని మోదీకి కావాల్సింది అని’ రాహుల్ గాంధీ ఆవేశంతో అన్నారు. మధ్యప్రదేశ్ సారంగపూర్లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. తాజగా వార్త సమాచారం మేరకు.. యాత్రలో కొందరు బీజేపీ కార్యకర్తలు మోదీ.. మోదీ జిందాబాద్ జై శ్రీరాం అని నినాదాలు చేసారు. మరికొందరు బీజేపీ కార్యకర్తలు ఆలుగడ్డలు ఇస్తామని తమకు బంగారం ఇవ్వాలని కోరారు. దానితో చిర్రెత్తిన రాహుల్ గాంధీ ఆ సమయంలో మరింత ఆవేశంగా మాట్లాడారు. దేశంలో ప్రధాని మోడీ దయవలన ఉద్యోగం లేని యువత సోషల్ మీడియా చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. రోజంతా రీల్స్ చూడటంలో బిజీగా ఉంటున్నారు. వారు అలా పని లేకుండా ఉండటం ప్రధాని మోదీకి ఇష్టం కావొచ్చుని ఎద్దేవా చేసారు.. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ కామెంట్లపై బీజేపీ స్పందించింది. మోదీపై ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించింది.
