సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి రేపు ( మంగళవారం ) శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాని మోడీ తో కలసి పర్యటించనున్నారు. గోరంట్ల మండలంలోని పాలసముద్రం వద్ద ఏర్పాటవుతున్న నాసిన్‌ (నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ నార్కోటిక్స్‌) ను సందర్శించనున్నారు. ప్రధాని పర్యటన లో సీఎం జగన్ తో పాటు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్ పాల్గొననున్నారు.సీఎం జగన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గోరంట్ల మండలం పాలసముద్రం చేరుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *