సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం జగన్మోహన్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో నేడు, శుక్రవారం ఉదయం ప్రధాని మోడీ తో సుమారు గంటన్నర పైగా సుదీర్ఘ భేటీ కావడం జరిగింది. ఎన్నికల వేళా రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి ఎత్తులకు ఫై ఎత్తుగా సీఎం జగన్ ఢిల్లీ లో ప్రధానిని కలిసారని ప్రచారం జరుగుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారిక సమాచారం ప్రకారం.. ఈ భేటీ లో రాష్ట్రము అభివృధి నిధుల కోసం సీఎం జగన్ ప్రధానిని విజ్ఞప్తి చేసారు. దీనిలో భాగంగా పోలవరం ప్రాజెక్ట్లో కాంపొనెంట్ వారీగా సీలింగ్ ఎత్తివేయడానికి కేంద్ర ఆర్థికశాఖ అంగీకరించిందని, దీంతో పాటు ప్రాజెక్టు తొలివిడతను సత్వరమే పూర్తిచేయడానికి రూ.12,911కోట్ల నిధుల విడుదలకూ అంగీకరించిందని, ఆ నిధుల విడుదలకు కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ప్రధాని తక్షణమే దృష్టిపెట్టాలని కోరారు. 2014 జూన్ నుంచి మూడేళ్లపాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా చేసిందని, దీనికి సంబంధించిన రూ.7,230 కోట్ల బకాయిలు ఏపీకి ఇప్పించాలని కోరారు.రాష్ట్ర విభజన సమయం లో ఇచ్చి న ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలని ఇంకా రాష్ట్రంలో కొత్త రోడ్డులు కొత్త రైల్వే లైన్ లు మంజూరు చెయ్యాలని విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుకు వీలైనం త త్వ రగా ఆమోదం తెలపాలని ప్రధానిని సీఎం జగన్ కోరారు.
