సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మ్యాజిక్ ఫిగర్ కు కొద్దీ దూరంలో ఉన్న ఇండియా కూటమి ప్రధాని రేసులో పాల్గొనబోమని చెప్పటంతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ బీజేపీకి రాకపోవడంతో ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పక్షాల మద్దతు తప్పనిసరైంది. ఇప్పటికే మోదీ ప్రధాని అభ్యర్థిత్వానికి కూటమిలో భాగస్వామ్య పార్టీలు అంగీకారం తెలిపాయి. భవిష్యత్తులో కూటమిలోని పార్టీలతో ఎటువంటి పేచీ లేకుండా ఉండేలా మంత్రివర్గం కూర్పు ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా మంత్రివర్గ కూర్పుపై ఈ సమావేశంలో చర్చించారు. నేడు, గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నివాసంలో జరిగిన సమావేశంలో అమిత్ షా, రాజ్‌నాధ్ సింగ్తో పాటు ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శులు సురేష్ సోని, అరుణ్ కుమార్, దత్తాత్రేయ హొసబళె హాజరయ్యారు. ప్రధాని మోడీ మంత్రివర్గంలో ఏపీ నుండి టీడీపీ కి ఇద్దరు లేదా ముగ్గురు, జనసేన కు ( బాల సౌరీ ? ) ఒక్కరు, బీజేపీ కి (సీఎంరమేష్ ? ) ఒక్కరు చప్పున 3లేదా 4గురు ఎంపీలు స్థానం పొందే అవకాసమ్ కనపడుతుంది.
