సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ఖరారయింది. వచ్చే అక్టోబర్ 16న ప్రధాని రాష్ట్ర పర్యటనలో భాగంగా.. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తారు. అదేరోజు శ్రీశైలం మల్లికార్జునస్వామిని ముందుగా దర్శించుకుంటారు.. తదుపరి కర్నూలులో జీఎస్టీ సంస్కరణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి రోడ్డు షో ను భారీ ర్యాలీ నిర్వహిస్తారు. తదుపరి ఏపీలో పలుఅభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వివరాలను మంత్రి నారా లోకేష్ శాసనమండలి లాబీలో మంత్రులు, ఎమ్మెల్సీలకు వివరించారు. (up file photo)
