సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జపాన్ దేశంతో పర్యటన ముగించుకొని ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు నిన్నశనివారం సాయంత్రం వెళ్లారు.7 ఏళ్ళ తరువాత వచ్చిన అరుదయిన అతిధిగా చైనా దేశం ఎయిర్ పోర్ట్ లో రెడ్ కార్పోపేట్ తో మేళతాళాలతో మోడీ కి చైనా లో ఉన్న భారతీయుల సహకారంతో ఘనంగా స్వగతం పలికించింది, ఏడేళ్ల తరువాత చైనాలో పర్యటిస్తున్న మోదీ.. నేడు, ఆదివారం చైనాలోని తియాజింగ్ లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. దీనికి ముందు నేడు ఆదివారం ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. ఇటీవల అమెరికా భారీ టారిఫ్ దాడులను అడ్డుకొనేందుకు వీరిద్ధరి మధ్య ఇరుదేశాల సంబంధాలను బలోపేతం చేసుకునే అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. సరిహద్దు నిర్వహణకు సంబంధించి ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధుల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. కైలాష్ మానసరోవర్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాలు కూడా తిరిగి ప్రారంభంకానున్నాయి. రెండు దేశాల్లోని 2.8 బిలియన్ల ప్రజల ప్రయోజనాలు ఇరు దేశాల సహకారంతో ముడిపడి ఉన్నాయి అన్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాట్లాడుతూ.. ప్రపంచంలో శాంతి, శ్రేయస్సు కోసం రెండు దేశాలు స్నేహితులుగా ఉండటం సరైన ఎంపిక అని అన్నారు. తూర్పున రెండు దేశాల పురాతన నాగరికతలు. ప్రపంచంలోనే రెండు అత్యధిక జనాభా కలిగిన దేశాలు. పక్కపక్కనే ఉన్న మనం.. స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉంటూ, రెండు దేశాలు అభివృద్ధికి దోహదపడే భాగస్వాములుగా ఉండటం ఇరుదేశాలకు సరైన ఎంపిక అని జిన్‌పింగ్ అన్నారు. రేపు సోమవారం కూడా ప్రధాని మోడీ చైనాలోనే ఉండి అక్కడకు వచ్చే రష్యా అడ్జక్షుడు పుతిన్ తో కూడా సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఆసియా కు చెందిన ఈ ముగ్గురు అగ్ర నేతల కలయిక ఫై వారి నుండి రానున్న సంచలన ప్రకటనపై వేచి చూస్తున్న అమెరికా ప్రభుత్వం తో పాటు ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.( ఫై తాజా చిత్రాలలో చూడవచ్చు)
