సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: నేడు, శనివారం ఉదయం నీతి ఆయోగ్‌పై ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. రాష్ట్రంలో పలు వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి ప్రతిపాదనలు ప్రధాని దృష్టికి తెచ్చారు. దేశవ్యాప్తంగా వెనకబడ్డ జిల్లాల్లో అభివృద్ధిపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని మాట్లాడారు. దేశంలో వివిధ అంశాల్లో ప్రగతిపై నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ వివరణలు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *