సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ ఆర్ధిక చరిత్రలో2025 నాటికీ భారత్ 4వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా బలోపేతం అవుతుందని గతంలో ప్రపంచ బ్యాంకు వేసిన అంచనా ను నిజం అయ్యింది. తాజా గా విడుదలయిన ఐఎమ్ఎఫ్ డేటా రిపోర్ట్ ప్రకారం భారత్ జపాన్‌ను అధిగమించి నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నీతీ అయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం నేడు, ఆదివారం మీడియా సమావేశంలో ప్రకటించారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ, ఆర్థిక పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయని ‘‘ప్రస్తుతం మనం నాలుగు ట్రిలియన్ డాలర్ల విలువైన నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ’’ అని అన్నారు. తాజా..భారత ఆర్థిక వ్యవస్థ జపాన్‌ కంటే పెద్దదని ‘‘అమెరికా, చైనా, జర్మనీ దేశాలే ప్రస్తుతం భారత్‌ కంటే ముందంజలో ఉన్నాయి. ప్రస్తుత ప్రణాళికలకు మనం కట్టుబడి ముందుకు సాగితే వచ్చే 3 ఏళ్లల్లో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది’’ అని అంచనా వేశారు. ఇటీవల పాక్ తో యుద్ధం కూడా వెంటనే ముగియడం భారత్ కు లభించిందనే చెప్పాలి. యుద్ధం బీకర రూపం దాలిస్తే ఇండియా ఆర్ధిక నష్టాలతో 5వ స్థానంలోనే ఉండేది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *