సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాశ్మిర్ లో ఉగ్రవాదుల ఘాతుకంపై ప్రతీకారం కోసం భారత్ రగిలిపోతుంది. భారత్ ను ఎవరూ భయపెట్టలేరని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. నేడు, బుధవారం త్రివిధ దళాధిపతులతో భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పహల్గాం దాడికి అతి త్వరలో ప్రతీకారం తీర్చుకుంటామని.. ప్రపంచం ఆశ్చర్యపోయేలా జవాబు ఇస్తామని అన్నారు. ఉగ్రవాదులు ఎక్కడ నక్కిన కూడా ఒక్క దోషిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ఉగ్రవాదులు పిరికిపంద చర్యకు పాల్పడ్డారన్న రాజ్ నాథ్ సింగ్.. ఈ చర్యకు పాల్పడిన వారిని మాత్రమే కాకుండా, తెరవెనుక ఉన్న వారిని కూడా వదిలిపెట్టబోమన్నారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు రాజ్ నాథ్ సింగ్. ఈ సంఘటనను ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాది నేతలు కూడా ఖండించారు. తాలిబన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కూడా ఈ భయంకరమైన సంఘటనపై వెంటనే స్పందించి ఖండించింది.జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన దాడిని IEA విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండిస్తోంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తోంది. ఇటువంటి చర్యలు దేశభద్రతను దెబ్బతీస్తాయి’ అని ప్రకటించారు.
