సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం క్షత్రియ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ జన్మదిన వేడుకలు లో పాల్గొన్న భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రతి ఏడాదీ భీమవరం పట్టణంలో లక్షలాది అభిమానులు ఘనంగా చేస్తూన్నారు . వేడుకలలో భాగంగా సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. ప్రతి ఏడాది ఈ కార్యక్రమానికి నన్ను పిలవడం చాలా ఆనందంగా ఉంటుంది. గతంలో ఉన్న హీరోలు మేమే దైవాంశ సంబూదులు లాగా ఊహల్లో తేలుతూ ఫీలయ్యేవారు. పౌరాణిక పాత్రల్లో నటించే వారు కాబ్బటి అలా ఫీలవ్వడం వారికే చెల్లుతుంది. అప్పట్లో వారంతా అభిమానులు, ప్రజలకు దూరంగా ఉంటూ వస్తుండేవారు. అయితే తెలుగు సినిమా స్థాయినే ప్రపంచ వ్యాప్తంగా పెంచేసిన ప్రభాస్ లేకుంటే బహుబలి సినిమా అనేది ఉండేది కాదేమో. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచ దేశాల్లో అభిమానులు ఉన్నారు. ఎంత ఎదిగినా.. ఎంత పాన్ ఇండియా స్టార్ అయినా ఆయన ఒదిగి ఉండే వ్యక్తిత్వం ప్రభాస్‌ది. నాకు సూపర్ స్టార్ కృష్ణగారు అంటే గతంలో అభిమానం.. ఆఖరికి నేను కూడా ప్రభాస్ అభిమానిగా మారిపోయానంటే అర్థం చేస్కోండి. ప్రభాస్ ను ఆదర్శంగా తీసుకుని పెద్ద, చిన్న హీరోలు ముందుకెళ్తున్నారు. ప్రపంచం కీర్తిస్తున్న ప్రభాస్ మన ప్రాంతం వాడు కావడం మనందరికీ గర్వకారణం. నాకు సుపరిచితులయిన పెద నాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు.. తండ్రి సూర్య నారాయణ రాజుల ద్వారానే ప్రభాస్‌కు మంచి అలవాట్లు వచ్చాయి. వాళ్లు అజాత శత్రువులు. మొగల్తూరు మహారాజులు అయినా ఎప్పుడూ ప్రజలు, సేవా కార్యక్రమాల్లోనే ఉండేవారు. ప్రభాస్ హీరో అయ్యాకే ఇప్పుడున్న కుర్ర హీరోలంతా కలిసి కట్టుగా ఉంటున్నారు. భీమవరం అందరి హీరోల అభిమానులంతా గొడవలు లేకుండా కలిసికట్టుగా ఉండాలని కూడా ఎమ్మెల్యే హితవు పలికారు. ప్రభాస్ అభిమానుల కోరిక ఫై భీమవరం లో స్వర్గీయ రెబల్ స్టార్ కృష్ణంరాజు కాంస్య విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయింపు ఫై జిల్లా కలెక్టర్ తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అందరి హీరోల అభిమానులతో పాటు జనసేన రాష్ట్ర నేత కనకరాజు సూరి కూడా పాల్గొనడం విశేషం.
