సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత దేశం మరో అధునాతన ఇంజనీరింగ్ అద్భుత నిర్మాణానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కాశ్మిర్ లోని చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మాణం జరిగింది. చీనాబ్ రైల్వే బ్రిడ్జిగా పిలువబడుతున్న ఈ బ్రిడ్జి ని నేడు, శుక్రవారం ఉదయం భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం ఉదమ్‌పూర్.. శ్రీనగర్.. బారాముళ్లా రైల్ లింక్ (USBRL) ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ప్రధాని ప్రారంభించిన చీనాబ్ రైల్వే బ్రిడ్జి ప్రత్యేకతల విషయానికి వస్తే.. కాశ్మిర్ టూరిజం మరింత పెంచే దిశగా .. ఇది 330 మీటర్లు ఈఫిల్ టవర్ కంటే చాలా ఎత్తైనది. ఈ బ్రిడ్జి ఏకంగా 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ బ్రిడ్జి పొడవు 1,315 మీటర్లు. కట్టింగ్ ఎడ్జ్ ఇంజనీరింగ్ టెక్నాలజీతో దీన్ని నిర్మించారు. ఈ బ్రిడ్జి గంటకు 266 కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా కూడా ఏమాత్రం చెక్కు చెదరదు. ఈ బ్రిడ్జి బ్లాస్ట్ రెసిస్టంట్ స్టీలు, కాంక్రీట్‌తో తయారు అయింది. బాంబు దాడులను సైతం బ్రిడ్జి తట్టుకుని నిలబడగలదు. పాక్ , చైనా లతో భవిషత్తులో యుద్దాలు వస్తే యుద్ధసామగ్రి భారత జవాన్ లకు అతి వేగంగా తరలించడానికి కొండల మధ్య 100 కిలోమీటర్లు పైగా దూరం కూడా తగ్గించడం శత్రువులకు దడ పుట్టిస్తుంది.
