సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: చాంపియన్ ట్రోఫీ ఫైనల్లో గత ఆదివారం భారత జట్టు విజయం సాధించడంతో గత రాత్రి నుండి పశ్చిమ గోదావరి జిల్లావాసులు యువత సంబరాలు చేసుకున్నారు. బాణ సంచా కాల్చి సందడి చేశారు. భీమవరం, పాలకొల్లు, ఉండి తణుకు టీపీ గూడెం, నరసాపురం పట్టణాలలో జోష్ కనపడింది.భీమవరం గునుపూడి, స్థానిక డిఎన్ ఆర్ కలశాల తదితర ప్రాంతాలలో జాతీయ జెండా లతో మిఠాయిలు పంచుతూ యువత ఉత్సహంగా బైక్ లపై సందడి చేసారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. అనంతరం భారత్ జట్టు బ్యాటింగ్‌కు దిగగా అభిమానులు ఉత్సాహంతో వీక్షించారు. భారీ స్క్రీన్ లలో , టీవీలు, సెల్ఫోన్లలో మ్యాచ్‌ను తిలకించారు. భారత్ ఆటగాళ్లు ఆవేశపడకుండా ప్యూహాత్మకంగా ఆడుతూ.. నిర్ణీత 49 ఓవర్లలో నాలుగు వికెట్ల తేడాతో 252 పరుగుల లక్ష్యాన్ని ఆరు బంతులు మిగిలుండగానే ఛేదించింది. వరుసగా మూడోసారి టీమిండియా చాంపియన్ ట్రోఫీ గెలవడంతో జిల్లాలో క్రికెట్ అభిమానుల ఆనందానికి అవఽధుల్లేకుండా పోయింది. వాస్తవంగా జిల్లావాసులు భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ చాంపియన్ ట్రోఫీ ఫైనల్‌ను మధ్యాహ్నం నుంచి ఉత్కంఠగా తిలకించారు.
