సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం ప్రపంచ జనాభా దినోత్సవం నేపథ్యంలో సుమారు 40లక్షల 70వేల మంది ప్రజలు ఉన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఏలూరు జిల్లా , పశ్చిమ గోదావరి జిల్లాలుగా విడిపోయిన తర్వాత అనేక మార్పులు జరిగాయి. ఇటీవల గణపవరం ను తిరిగి పశ్చిమ గోదావరి జిల్లాలో కలిపారు. గతంలో ఉమ్మడి జిల్లా గా ఉన్నపుడు పశ్చి మగోదావరి జిల్లా జనాభా పరంగా రాష్ట్రంలో 8వస్థానంలో ఉండేది. ప్రస్తుతం విభజన జరిగిగాక ఏలూరు జిల్లా 9వ స్థానంలో కొనసాగుతుండగా పశ్చి మ గోదావరి జిల్లా తక్కువ జనాభాతో 18వ స్థానంలో ఉంది. అయితే అక్షరాస్యతలో మాత్రం ప్రజలలో 78.85 అక్షరాస్యత శాతంతో రాష్ట్రంలో ఇప్పటికి పశ్చిమ గోదావరి జిల్లా నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుండటం విశేషం ఏలూరు జిల్లా లో మాత్రం అక్షరాస్యత 71.60 శాతంతో వెనుకబడి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *