సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల వరుస సినిమాల షూటింగ్‌లతో తో స్పీడ్ పంచిన భీమవరం బ్రాండ్, పాన్ ఇండియా సూపర్ స్టార్ హీరో ప్రభాస్‌కు ఓ సినిమా షూటింగ్లో అయన కాలుకు గాయాలు అయ్యాయి. ఓ సినిమా షూటింగ్లో జరిగిన ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా ప్రకటించారు. దీనితో కల్కీ సినిమా జపాన్ ప్రమోషన్స్‌కు వెళ్లడం లేదని ప్రభాస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం రాజా సాబ్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే సమ్మర్ లో విడుదలకు సిద్ధం చేస్తున్నారు.ప్రభాస్‌కు గాయపడడంతో… దీని ప్రభావంతో వేలకోట్ల వ్యాపారం చేస్తున్న ఆయన సినిమాల రిలీజ్ ల విషయంలో మార్పులు చేర్పులు ఫై టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీ లు లో పెద్ద చర్చ జరుగుతుంది.
