సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మొత్తానికి భీమవరం బ్రాండ్ ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా కల్కి గా మారిన తరువాత గాని ఆయనకు పెళ్లి యోగం రాలేదు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రమోషన్స్ కోసం మెగా ప్రిన్స్ రామ్ చరణ్.ను బాలయ్య.. ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావన తీసుకురాగా ఆయన గుడ్ న్యూస్ చెప్పినట్లు సమాచారం. అవును.. ఆ అమ్మాయి ఎవరో కాదు.. పదహారు అణాల పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు అమ్మాయి. భీమవరంకు సమీపంలోని గణపవరంకు చెందిన అమ్మాయి అని చరణ్ తెలిపినట్లు సమాచారం. అంతే కాదు ఇటీవల మీడియాతో రెబల్ స్టార్ కృష్ణంరాజు భార్య శ్యామల దేవి ..”దీర్ఘ కాలం నుండి వేచి చూస్తున్న పెళ్ళికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ త్వరలోనే ఉండబోతుంది. పైనున్న కృష్ణంరాజు గారు అన్ని సవ్యంగా చూసుకుంటారు అన్నారు. దీంతో ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. కాగా, ప్రభాస్ ఫ్యాన్స్ ఈసారైనా ఈ వార్త నిజం కావాలని గట్టిగా కోరుకుంటు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *