సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్, పాన్ ఇండియా సూపర్ స్టార్, ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నమారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ మూవీ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ 5న విడుదల కానున్నట్లు తెలియజేస్తూ ఎక్స్ లో పోస్టర్ షేర్ చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల కానుంది. అభిమానులకు బోనస్ గా ఈనెల 16న మూవీ టీజర్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కామెడీ హర్రర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ యువకుడిగా, ఆత్మ గా ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. ఈ సినిమాతో డార్లింగ్ మొదటి సారి ప్రభాస్ కెరీర్‌లో పూర్తిస్థాయి హారర్ ఎంటర్‌టైనర్‌గా ‘ది రాజా సాబ్’ రానున్నాడు.
