సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల తెలుగులో కొత్త ట్రెండ్ మొదలయింది. గతంలో సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల పాత సినిమాలను రీ మాస్టర్ చేసి 4K వెర్షన్‌లో మరోసారి విడుదల చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ వెర్షన్‌లో ఇప్పటికే ‘పోకిరి, జల్సా, చెన్నకేశవరెడ్డి’ వంటి సినిమాలు కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టాయి. ఇక భీమవరం బ్రాండ్.. పాన్ ఇండియా సూపర్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన స్టైలిష్ హిట్ మూవీ ‘బిల్లా’ సినిమా 4K వెర్షన్‌‌ను ఈ నెల 23న ఆయన పుట్టినరోజు స్పెషల్‌గా విడుదల చేస్తున్నారు. విశేషం ఏమిటంటే.. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా.. యూఎస్‌లోనూ ఈ సినిమాను రికార్డు స్థాయిలో విడుదల చేస్తున్నారు. యూఎస్‌లో ఇప్పటి వరకు 70 పైగా లొకేషన్స్‌ పైగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. గతంలో ఏ తెలుగు హీరో రి రిలీజ్ ఇంత పెద్ద స్థాయిలో జరగలేదు. ప్రభాస్ రేంజ్‌కు తగ్గట్టు రీ రిలీజవుతున్న ఈ సినిమాకి టికెట్స్ కూడా అదే రేంజ్‌లో అడ్వాన్స్ బుకింగ్ లో తెగుతున్నాయి. ఇక ‘బిల్లా’ విషయానికి వస్తే.. దివంగత రెబల్ స్టార్ కృష్ఱంరాజు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.. ఈ రీ రిలీజ్‌లో వచ్చిన వసూళ్లను యూకే ఇండియా డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్‌కు ఇవ్వబోతున్నట్లుగా కృష్ణంరాజు కుమార్తె ప్రసీధ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *