సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నాగ్ అశ్వి న్ దర్శకత్వంలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రం ‘ప్రాజెక్ట్ – కె’ సినిమాలో చాల కాలంగా ప్రచారం ఉన్న .. లోకనాయకుడు.. కమల్ హాసన్ కీలక రోల్ లో నటిస్తున్నట్లు ( ప్రతి నాయకుడు..) ఈ భారీ ప్రాజెక్ట్ లో అమితాబ్ తో పాటు భాగం కానున్నట్లు చిత్ర యూనిట్ నేడు, ఆదివారం అధికారికంగా ఆయన పోస్టర్ తో ప్రకటన విడుదల చేసారు. మరో హీరో దుల్కర్ సల్మాన్ కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఆగస్టు నుండి కమల్ హాసన్, ప్రభాస్ తో కలసి రెగ్యులర్ షూటింగ్లో పాల్గొంటారని తెలుస్తుంది. కమల్ హాసన్ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భం గా ఓ ప్రత్యేక వీడియోను ‘ప్రాజెక్ట్-కె’ బృందం విడుదల చేసింది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అగ్ర నిర్మాత అశ్వనీదత్ 500 కోట్ల బడ్జెట్ తో మునుపెన్న డు చూడని భారీ చిత్రం గా, అతిపెద్ద సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ డ్రామాగా ఇది తెరకెక్కు తోంది.
