సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ‘రాజా సాబ్‘ సంక్రాంతి కానుకగా వచ్చిన మొదటి సినిమా. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రభాస్ కెరీర్లో మరో కొత్త ప్రయోగం. భారీ ఓపెనింగ్స్ తో నిన్న గురువారం రాత్రి 9 గంటల ఈ 3న్నర గంటల సినిమా ఒక రోజు ముందే ప్రీమియర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సంక్రాంతికి ప్రభాస్‌కు ఇది హిట్ ఖాతాలో పడిందా? లేదా? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే…మొత్తం కథ నర్సాపూర్ అటవీ ప్రాంతంలో ఉన్న ఒక కోట చుట్టూ తిరుగుతుంది.ఉన్న ఆస్తులన్నీ కోల్పోయిన ఒక జమీందారీ కుటుంబానికి చెందిన రాజు అలియాస్ రాజాసాబ్ (ప్రభాస్), అల్జీమర్స్‌తో బాధపడుతున్న తన నానమ్మ గంగమ్మ (జరీనా వాహబ్)తో కలిసి సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. తన యవ్వనంలో అమ్మవారి నగలు తీసుకురావడానికి వెళ్లి తిరిగి రాని భర్త కనకరాజు (సంజయ్ దత్) కోసం గంగమ్మ ఇంకా ఎదురుచూస్తూనే ఉంటుంది. ఒక అనుకోని సందర్భంలో తన తాత ఫోటో కనిపించడంతో రాజాసాబ్ హైదరాబాద్‌కు వచ్చి అతడిని వెతకడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో రాజాసాబ్ తన తాతను కనుగొన్నాడా? కనకరాజు, గంగరాజు (సముద్రఖని) మధ్య అసలు గొడవ ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం సినిమా చూడవలసిందే..ఒక్క ముక్క లో చెప్పాలంటే..సినిమా మొదటి అరగంట చివరి అరగంట బాగా తీశారు. మధ్యలో కొంత లాగుడు ఉంటుంది. సత్య ప్రభాస్ ల మధ్య సెకండ్ హాఫ్ లో కామిడి సన్నివేశాలు బాగున్నాయి. గ్రాఫిక్స్ కొన్ని చోట్ల అద్భుతంగ, మరి కొన్ని చోట్ల నాసిరకంగా కనిపించాయి. ఇక ఈ సినిమాలో మనకు10 ఏళ్ళ క్రిందటి హుషారైన వింటేజ్ లుక్ లో హుషారైన ప్రభాస్ కనిపిస్తాడు. అభిమానులకు పండుగ చేసేలా బాగా నటించాడు. సినిమా మొదటి సన్నివేశాల నుంచే సంజయ్ దత్ పోషించిన కనకరాజు పాత్ర డబ్బు పిచ్చితో ఇతరుల సంపదను మాయాజాలంతో దోచి కోటలో దాచుకోవడం, చనిపోయాక కూడా ఆ సంపద తనకే ఉండాలనే ఉద్దేశంతో వీలునామా తనకే రాసుకోవడం కథకు ఆసక్తిని తీసుకొస్తాయి. కథ నెమ్మదిగా సాగడంతో కొంత బోర్ అనిపిస్తుంది.సెకండాఫ్‌లో సంజయ్‌దత్ పాత్ర ప్రభాస్ ఎదురుపడిన తర్వాత మరింత ఆసక్తికరంగా మారుతుంది..ప్రభాస్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని ముగ్గురు హీరోయిన్స్ ను జోడించడం వల్ల అసలు కథ ఫోకస్ కొంత తప్పిందనే భావన కలుగుతుంది. జరీనా వాహబ్ నానమ్మ పాత్రలో అద్భుతంగానటించారు. తమన్ సంగీతం ఈ సినిమాకు పాటలలో బలం లేకపోయినా సినిమా .బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా ఇచ్చారు. కార్తీక్ ఫలనీ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. వీఎఫ్ఎక్స్ మంచి స్థాయిలో ఉన్నాయి. దర్శకుడు మారుతి విజువల్‌గా సినిమా గ్రాండ్‌గా తీసినప్పటికి కొంత, కథనంలో స్వష్టత లోపించింది. ఏది ఏమైనా పండుగ వినోదానికి రాజాసాబ్ చూడవలసిన సినిమానే.
