సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరో బాలీవుడ్ హీరో టాలీవుడ్ లో అడుగుపెట్టేందుకు సిద్ధం అవుతున్నాడట. ఆ హీరో మరెవరో కాదు బిగ్ బి .. అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్.. అవును, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. ఆ సినిమానే ‘ఫౌజీ’. సీతా రామమ్ సినిమాతో నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సెంకండ్ వరల్డ్ వార్ నేపధ్యంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించ బోతున్నాడు. అయితే, ఈ సినిమాలో మరో బలమైన మిలటరీ అధికారి పాత్ర లో అభిషేక్ కనిపించబోతున్నారు. సీతారామమ్ సినిమాలో సుమంత్ అక్కినేని చేసిన పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరోసారి అలాంటి పాత్రలో.. ? ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ పౌజీ సినిమా 2026 లో వేసవి లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అతిత్వరలో కల్కి 2 షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈసారి ఈ సినిమాలో దీపికా పదుకొనె నటించడం లేదని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఆమె స్థానంలో మరో బాలీవుడ్ బ్యూటీ రానుంది మరి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *