సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కించనున్న ‘స్పిరిట్’ (Spirit) చిత్రం షూటింగ్ ప్రారంభమయింది. ఘనంగా . ముహూర్తపు వేడుకకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. (ఈసినిమాలో చిరంజీవి కీలక పాత్రలో నటిస్తారు అని తెలుస్తుంది. షూటింగ్ కు ప్రభాస్ హాజరు కాలేదు కానీ చిరంజీవి వచ్చారు . షూటింగ్ సమయంలో చిరు ఫోటో బిగ్ సైజు పెట్టి అక్కడ సందీప్ వంగ, చిరంజీవి ఫోటోలకు స్టిల్స్ ఇవ్వడం గమనార్హం.) టీ సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్ బేనర్లపై భూషణ్‌కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శక్తిమంతమైన పోలీస్ అధికారి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు త్రిప్తీ దిమ్రీ కథానాయిక. ప్రకాశ్‌రాజ్, వివేక్ ఒబెరాయ్, కాంచన కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తొమ్మిది భాషల్లో ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదల కానుంది.
