సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మెుదటిసారిగా రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) సమావేశాన్ని గురువారం నిర్వహించారు. పిఏసీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. గత 11 నెలల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ప్రభుత్వం చేపడుతున్న సూపర్ సిక్స్ పథకాలపై చర్చించారు. కార్యక్రమంలో పి ఏ సి సభ్యులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యే సభ్యులు విశేషంగా పాల్గొన్నారు.
