సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్; ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నన భోజనానికి సీఎం జగన్ ఓ కొత్త రూపం తీసుకొచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సుమారు 15 వైరైటీలతో రోజుకో మెనూ అమలు చేస్తున్నామన్నారు. జగనన్న గోరుముద్ద ద్వారా బడి పిల్లలకు వారానికి మూడు రోజులు ఉదయం పూట రాగి జావ అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు, మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభిస్తున్నారు, . రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ ,ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 37,63,698 మంది విద్యార్ధులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఏటా రూ.86 కోట్ల అదనపు వ్యయంతో రాగి జావ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బలవర్థకమైన ఆహారానికి ఏటా రూ.1,910 కోట్లు ఖర్చు అవుందని సీఎం జగన్ ప్రకటించారు, మధ్యా హ్న భోజన పథకానికి గత సర్కారు సగటున రూ.450 కో ట్లు మాత్రమే ఖర్చు చేయగా ఇప్పుడు జగనన్న గోరుముద్ద ద్వారా దాదాపు నాలుగురెట్లు అధికంగా వ్యయం చేస్తున్నాము ఉన్నత విద్య లోనూ సమూల మార్పులు తీసుకొస్తున్నాంవిద్యా దీవెన, వసతి దీవెనతో విద్యార్థుల భవిష్యత్కు అం డగా ఉంటున్నాం గోరుముద్ద కార్యక్రమాన్ని ఇంకా మెరుగ్గా అమలు చేస్తున్నాం. ఇవాళ్టి నుంచి గోరుముద్దలో రాగి జావ చేరుస్తున్నాం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *