సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లోని జిల్లా కలెక్టరు కార్యాలయం నుండి మండల స్థాయి అధికారులతో నేడు, శుక్రవారం గ్రామ సచివాలయాలు, ఆర్బీకే, వై.ఎస్.ఆర్. హెల్త్ క్లినిక్ డిజిటల్ లైబ్రరీ లు, బి ఎం సి యు, ఏ ఎం సి యు లు , నాడు – నేడులో చేపట్టిన భవనాల నిర్మాణ పనులపై మండల అధికారులు, పంచాయత్ రాజ్ శాఖ అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్సులతో జిల్లా కలెక్టరు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ పేద కుటుంబం గుమ్మం వద్దకు పాలనను తీసుకువెళ్లేందుకు గ్రామా సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేసింది, అదే విధంగా రైతుల అవసరమైన సేవలను అందించేందుకు రైతు భరోసా కేంద్రాలను, “ఫ్యామిలీ ఫీజీషియన్” విధానం ద్వారా ప్రతీ పేద ఇంటి వద్దకే వైద్య సేవలందిస్తున్నదన్నారు. వీటికి సంబంధించిన భవనాల నిర్మాణాలను వేగవంతం చేసి, అక్టోబరు నెలాఖరు నాటికి నూరుశాతం పూర్తి చేసే లక్ష్యంతో అధికారులు, సిబ్బంది పనిచేయాలన్నారు.ఈ విషయంలో ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినప్పటికీ పనులలో పురోగతి లేదన్నారు. అలక్ష్యం వహిస్తే తీవ్ర స్థాయిలో శాఖపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంకా పనులు ప్రారంభించని భవనాల నిర్మాణ పనులను ఈ నెల 15వ తేదీలోగా బేస్మెంట్ స్థాయికి తీసుకురావాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్సులపై ఉందన్నారు. పూర్తి అయిన భవనాలు ప్రారంభించాలని ఆదేశించారు.
